ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రిటన్‌లో మరోసారి నిరసన గళాలు వినిపించాయి. రాయల్ కాలేజీ ఆఫ్ నర్సింగ్‌కు చెందిన నర్సులు దేశవ్యాప్తంగా ధర్నాకు దిగారు. . ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన నర్సులు ఒకరోజు ధర్నాకు పిలుపునిచ్చారు. జీతాలు 5 శాతం పెంచాలని, పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు కల్పించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు వస్తున్న జీతం సరిపోవడం లేదు. మా జీతాలు పెంచాలి అని అమీరా అనే సీనియర్ నర్స్ చెప్పింది. రాయల్ కాలేజీ ఆఫ్ నర్సింగ్‌కు చెందిన నర్సులు రోడ్కెక్కడం అనేది 106 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. ధర్నాకు మద్దతుగా దాదాపు లక్ష మంది విధులకు గైర్హాజరయ్యారు.