అమెరికా కాకుండా మరో దేశం నుంచి కమర్షియల్ రాకెట్లను నాసా ప్రయోగించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలోని ఉత్తర భూభాగం నుంచి రాకెట్‌ను ప్రయోగించింది. దీంతో అమెరికాకు చెందిన నాసా చరిత్ర సృష్టించింది. దుపుమా పీఠభూమిలో ఉన్న ఆర్నహెమ్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగికి ఎగిరింది. అంతరిక్షంలోకి ఆ రాకెట్ సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది. భూ నక్షత్ర మండలంలో ఉన్న ఆల్ఫా సెంచరీ ఏ, బి నక్షత్ర సమూహాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలించనున్నారు. ఆల్ఫా సెంచరీ నక్షత్ర మండలం కేవలం దక్షిణ ద్రువం నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా నుంచి మూడు రాకెట్లను నాసా ప్రయోగించాలని నిర్ణయించింది. దాంటో భాగంగా మొదటి ప్రయోగం పూర్తి అయ్యింది.














