అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన మూడు కేసుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. అయితే అతనికి విధించే శిక్షను ఇంకా ప్రకటించ లేదు. సాధారణంగా దోషిగా నిర్ధారించిన 120 రోజుల్లో నిందితుడికి శిక్ష విధిస్తారు.

కాగా, ఒక దేశ అధ్యక్షుడి కుమారుడికి కేసులో శిక్ష పడటం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. మారణాయుధం కొనేటప్పుడు తన దగ్గర ఉన్న మాదకద్రవ్యం గురించి అబద్ధం చెప్పాడని హంటర్ బైడెన్‌పై మొదటి అభియోగం. ఈ కేసులో అతడు 10 ఏండ్ల పాటు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే రెండో కేసులో ఐదేండ్లు, మూడో కేసులో మరో పదేండ్లు శిక్ష పడవచ్చు. అయితే న్యాయస్థానం ఇచ్చే ఏ తీర్పునైనా అంగీకరి స్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానని జో బైడెన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
