భారతీయుల అమెరికా ప్రయాణాలకు ఈసారి బ్రేక్ పడింది. 2001 తర్వాత తొలిసారిగా అమెరికాకు వెళ్లే భారతీయ ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ పరిణామం పర్యాటక రంగ నిపుణులతో పాటు ఇరు దేశాల సంబంధాలపై ఆందోళనలను పెంచుతోంది.

అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏటా జూన్‌లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిరుడు జూన్‌లో 2.3 లక్షల మంది వెళ్లగా, ఈ ఏడాది జూన్‌లో 2.1 లక్షల మంది వెళ్లారు. అంటే, 8 శాతం తగ్గుదల నమోదైంది. ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కావడం ఈ మిలీనియంలో ఇదే తొలిసారి. నిరుడు జూలైలో కన్నా ఈ ఏడాది జూలైలో 5.5 శాతం తగ్గుదల కనిపించింది.
















