ప్రపంచ పాస్పోర్టు సూచికలో భారత్ ర్యాంకు దిగజారింది. ఐదు పాయింట్లు తగ్గి 85వ స్థానంలో నిలిచింది. సింగపూర్ వరుసగా రెండోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేసిన హెన్లీ పాస్పోర్టు సూచీ 2025 ప్రకారం భారత్ 2024లో లభించిన 80వ స్థానం కన్నా ఐదు పాయింట్లు దిగజారి 85వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వరుసగా 103, 101 స్థానాల్లో, అమెరికా 9, చైనా 60, జపాన్ 2, కెనడా 7 స్థానాల్లో నిలిచాయి. 2006-2025 మధ్య డాటా పరిశీలిస్తే భారత్ 2021లో అతి తక్కువగా 91, 2021లో అత్యధికంగా 71వ ర్యాంక్ పొందింది. గత 10 ఏండ్లుగా పాస్పోర్టు సూచీలో ర్యాంకింగ్ స్థాయి దిగజారుతూ వస్తున్న మొదటి ఐదు దేశాలలో వెనిజులా, అమెరికా, వనౌతు, బ్రిటన్, కెనడా ఉన్నాయి.