పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 25వ తేదీ నుంచి నవంబర్ 1వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 25వ తేదీన లోకేశ్ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. పత్ర సినర్జీస్, బోసన్, స్పాన్‌ఐఓ, క్లారిటీ, ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ సంస్థల ప్రతినిధులు, భారత కాన్సుల్ జనరల్‌తో 26న భేటీ అవుతారు. ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో 27న, రెడ్‌మండ్‌లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న భేటీ కానున్నారు. 29న అమెజాన్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడంతోపాటు ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. అదే రోజు లాస్ వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశానికి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరవుతారు. ఈ నెల 30న వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో నవంబరు 1న సమావేశమవుతారు.