Namaste NRI

ఒక స్టార్ హీరో చేయాల్సిన కథ ఇది .. కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం మీటర్. రమేష్ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని  స్టార్ దర్శకుడు బాబీ కొల్లి లాంచ్ చేశారు. ఈ  సందర్భంగా బాబీ కొల్లి మాట్లాడుతూ ఈ సినిమా కిరణ్ అబ్బవరంకు మాస్ మీటర్‌ని  సెట్ చేస్తోందని నమ్ముతున్నాను. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ కమర్షియల్ మీటర్ అనిపిస్తోంది  అని చెప్పారు. నిర్మాత చిరంజీవి (చెర్రి) మాట్లాడుతూ  మా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  సంస్థలో ఇప్పటిదాకా ప్రయోగాత్మక  చిత్రాలను నిర్మిస్తూ వచ్చాం. ఈ కథ వినగానే ఒక పక్కా కమర్షియల్ సినిమా ఎందుకు నిర్మించకూడదు అనిపించింది. అలా  మీటర్  సినిమాను నిర్మించాం. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్‌లో  హై బడ్జెట్ మూవీ అవుతుంది.

టీజర్ ఎంత స్పీడ్‌గా  ఉందో సినిమా కూడా అంతే రేసీగా ఉంటుంది. కిరణ్ అబ్బవరంకు  ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ ఇది అన్నారు. దర్శకుడు రమేష్ కాదూరి మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఒక స్టార్ హీరో చేయాల్సిన కథ ఇది. యువ హీరోలకు రిస్క్ లాంటిదీ స్టోరి. ఎందుకంటే హై మూవ్‌మెంట్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. నేను థియేటర్లో ఎలాంటి సినిమాలు చూసి విజిల్స్ వేశానో అలా ఉంటుంది. ఒకటికి పది సార్లు ఆలోచించుకున్న తర్వాత ఈ సినిమా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేస్తారు అన్నారు.  ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ  కార్యక్రమంలో చెర్రి, రమేష్ కడూరి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events