ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికరమైన పరిణామాలతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన చిత్రం లక్కీ లక్ష్మణ్. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి అదృష్టం హలో అంది రో అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రముఖ రచయిత భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని సింగర్ రామ్ మిరియాల చక్కగా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డిఓపి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి. ఇందులో డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శివ నిర్వాణ మాట్లాడుతూ టైటిల్ సాంగ్ చాలా బాగుందన్నారు. మేకర్స్‌కు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారని అన్నారు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోహైల్ తదితరులు మాట్లాడారు. ఎఆర్. అభి దర్శకత్వం వహించారు. హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది.














