ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా నిలిచే దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బెదిరింపులకు దిగారు. ఉక్రెయిన్ విషయంలో వకాల్తా పుచ్చుకోవాలనుకునే దేశాలు తాను చెప్పే ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎవరైనా మా ఘర్షణల విషయంలో జోక్యం చేసుకోవాలని సూచినా, మా దేశాన్ని బెదిరించినా, మా ప్రజల భద్రతకు విఘాతం కలిగించినా మేం వెనువెంటనే బదులిస్తాం. మేము ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే మీ జీవితంలో అలాంటి తీవ్రమైన పరిణామాలను కనీవినీ ఎరిగి ఉండరు. దీనికి సంబంధించి మేం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అందుకు అనుగుణంగా అన్ని చర్యలూ తీసుకున్నాం. కాబట్టి అందరూ నా మాట వింటారని అనుకుంటున్నా అంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.