అమెరికాలోని మసాచుసెట్స్‌లోని అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన గెట్‌వెల్ కార్డులో వన్ మిలియన్ (రూ.7.5 కోట్లు) లాటరీ తగిలింది. మసాచుసెట్స్ రాష్ట్ర లాటరీ కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెక్లీష్‌కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టికెట్‌లను తీసుకున్నాడు. అయితే సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేయగా వన్ మిలియన్ భారీ లాటరీ గెలుచుకున్నాడు. అన్ని టాక్స్‌లు పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం 20 డాలర్లు (రూ.1500) పెట్టి కొన్న లాటరికీ 6,50,000 డాలర్లు (రూ.4.8 కోట్లు) పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
…………..