Namaste NRI

నా కెరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్‌ : సందీప్‌ కిషన్‌

సందీప్‌ కిషన్‌, రీతువర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. నక్కిన త్రినాథరావు దర్శకుడు. రాజేష్‌ దండా నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో సందీప్‌ కిషన్‌ మాట్లాడారు. మజాకా సినిమా రెండు గంటలపాటు లాఫ్‌ రైడ్‌గా ఉంటుంది. థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయి. నా కెరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్‌ గా నిలుస్తుంది  అని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకోసం ప్రాణం పెట్టి పనిచేశామని, రావురమేష్‌ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సందీప్‌ కిషన్‌ తెలిపారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ఓ ఇంట్లో ఇద్దరే మగాళ్లుంటారు. ఎప్పటికైనా ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని వారు తపిస్తుంటారు. ఆ తపనే మా మజాకా సినిమా. శివరాత్రి రోజు డబుల్‌ మ్యాజిక్‌ చేసే సినిమా ఇది అని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే, ఓ తండ్రీకొడుకులు, ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడితే? అనే కాన్సెప్ట్‌తో ఈ ట్రైలర్‌ ఆద్యతం కామెడీగా సాగింది.   ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events