అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రాంబాయి నీ మీద నాకు లిరికల్ సాంగ్‌ను హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. లైట్ మూవ్‌మెంట్స్‌తో వెళ్తూ హెవీ ఎమోషన్‌తో పూర్తవుతుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డ్స్ ఈ సినిమాకు వస్తాయి అని అన్నారు. ఈ వేడుకలో లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్, నటుడు శివాజీ రాజా, నటుడు చైతు జొన్నలగడ్డ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్, ఈటీవీ విన్ హెడ్ సాయికష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, హీరోయిన్ తేజస్వినీ రావ్, హీరో అఖిల్ ఉడ్డెమారి, సింగర్ నల్లగొండ గద్దర్ నర్సన్న తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
















