Namaste NRI

అలాంటి వారికి ఈ సినిమా ఓ పాఠం: త్రినాథరావు

ఇంద్ర రామ్‌,  పాయల్‌ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు నటిస్తున్న చిత్రం చౌర్యపాఠం. దర్శకుడు నక్కిన త్రినాథరావు. నిఖిల్‌ గొల్లమారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నక్కిన త్రినాథరావు విలేకరులతో మాట్లాడారు.  రియల్‌ లైఫ్‌లో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి ఈ సినిమా డీవోపీ కార్తీక్‌ ఘట్టమనేని ఓ సందర్భంలో నాకు చెప్పారు. సినిమా చేద్దాం,  దాన్ని కథగా రాయి  అని అడిగాను. అలా చౌర్యపాఠం  ప్రయాణం మొదలైంది  అని అన్నారు.

దొంగతనం చేయాలనుకునేవారికి ఈ సినిమా ఓ పాఠం. హీరో ఇంద్ర రామ్‌, కథానాయిక పాయల్‌ రాధాకృష్ణ, రాజీవ్‌ కనకాల అందరూ అద్భుతంగా నటించారు. మ్యూజిక్‌ కూడా చాలా బావుంటుంది. అందర్నీ ఈ సినిమా తప్పక అలరిస్తుంది  అని త్రినాథరావు  చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events