Namaste NRI

ఈ కథలో ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి : డింపుల్‌ హయాతి

రవితేజ నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి కథానాయికలు . చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. కిషోర్‌ తిరుమల దర్శకుడు. ఈ సందర్భంగా కథానాయికలు అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమాలో తన పాత్రపేరు మానసశెట్టి అని, ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తానని, ప్రతి ఒక్కరూ రిలేట్‌ చేసుకునేలా తన క్యారెక్టర్‌ ఉంటుందని అషికా రంగనాథ్‌ తెలిపింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీ డ్రామాగా మెప్పిస్తుందని చెప్పారు.

స్త్రీ పురుష సంబంధాల్లోని సంఘర్షణ, భావోద్వేగాలను ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారని ఆమె చెప్పింది. కెరీర్‌ ఆరంభంలోనే అగ్రహీరోలతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అషికా రంగనాథ్‌ ఆనందం వ్యక్తం చేసింది. డింపుల్‌ హయాతి మాట్లాడుతూ ఈ సినిమాలో రవితేజ భార్య బాలామణి పాత్రలో కనిపిస్తానని, ఈ కథలో ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పింది. సెన్సిబుల్‌ కామెడీతో పాటు హార్ట్‌ టచింగ్‌ మూమెంట్స్‌తో సినిమా ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుందని డింపుల్‌ హయాతి తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events