రష్యా ఓ యుద్ధానికి ప్రణాళిక రచిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. మ్యూనిచ్‌సదస్సు నుంచి ఆయన మాట్లాడుతూ 1945 తర్వాత ఐరోపాలో అతిపెద్ద యుద్ధం ఇదే అవుతుందని అన్నారు. ప్రస్తుతం రష్యా ప్లాన్ కొంత అమల్లోకి కూడా వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధానికి చెల్లించాల్సిన మూల్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు సజీవంగానే ఉన్నయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. రష్యా కనుక దాడికి ప్రారంభిస్తే కఠిన ఆంక్షలను విధిస్తామని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. రష్యా కంపెనీలు పౌండ్స్, డాలర్లలో ట్రేడిరగ్ చేయకుండా అడ్డుకొంటామని పేర్కొన్నారు. ఆ చర్య రష్యాను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
