రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం తెలిసినవాళ్లు. విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఓ కొత్త తరహా కథాంశంతో రూపొందిన చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ ఇలా పలు రకాల జానర్స్ ఇందులో మిళితమై ఉంటాయి. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. త్వరలో సెన్సార్ పూర్తి చేసి నవంబర్లో సినిమా విడుదల చేయనున్నాం అన్నారు. నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంత పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం: అజయ్ వి. నాగ్, అనంత్ నాగ్ కావూరి.