ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ) రూపొందించిన థ్రెడ్స్ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల మందికి పైగా థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యాప్ త్వరలోనే ట్విట్టర్‌ను అధిగమించడం ఖాయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.


