ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్ తొలి సీజన్ మంచి విజయాన్ని సాధించిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి త్రీ రోజెస్ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు కిరణ్ కె.కరవల్ల దర్శకుడు.ఈ సీజన్ 2 హైలైట్స్‌ను కథానాయిక ఈషా రెబ్బా, నటుడు హర్ష చెముడు మీడియాతో పంచుకున్నారు. ఈషా మాట్లాడుతూ తొలి సీజన్‌ను మించి ఈ మలి సీజన్ ఉంటుంది. ఇందులో గ్లామర్ డోసేం ఎక్కువగా ఉండదు. కుటుంబంతో కలిసి ఈ సిరీస్ చూడొచ్చు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి.ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉంటుంది. సీజన్ 3కి లీడ్ ఇస్తూ ఈ సీజన్ ముగుస్తుంది. నేను, హర్ష సీజన్ 1లో చేసిన సీన్స్ అంత వైరల్ అవుతాయని అనుకోలేదు. ఆ రెస్పాన్స్ ఈ సీజన్ 2కు బాగా హెల్ప్ అయింది. ఈ సిరీస్ నా కెరీర్‌కే స్పెషల్ అని తెలిపారు.

తొలి సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ 2కు బడ్జెట్ ఎక్కువ. సీజన్ 1లో రివేంజ్‌ను ఈ సీజన్ 2లో తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా. ఈషా, నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. తెలుగు వెబ్ సిరీస్‌లతో చూసుకుంటే ఇది పక్కా సీక్వెల్. షూటింగ్ అంతా సరదాగా సాగిపోయింది. ఇందులో జీవితం, బంధాలు, స్నేహం గురించి చర్చించాం. మారుతి ఈ సిరీస్‌ను బాగా గైడ్ చేశారు. ఈ సిరీస్ ఇంత గ్రాండ్ కాన్వాస్‌లో రావడానికి కారణం ఆయనే అని పేర్కొన్నారు.
















