రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజకు జోడిగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలకానుంది. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పష్టతనిస్తూ చిత్రబృందం ఓ ప్రకటన చేసింది. ఈ సినిమా విషయంలో ఎలాంటి వదంతులను నమ్మొద్దు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన తేదీకే ఈ సినిమా మీ ముందుకొస్తుంది అని నిర్మాత తెలిపారు. కొన్ని నెలల క్రితం రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై ఫస్ట్-లుక్ పోస్టర్ , కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేయడం ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్‌లను యూనిక్ స్టయిల్ లో ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్,