టిక్‌టాక్ యాప్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా, డెన్మార్క్, కెనడా దేశాలు బ్యాన్ యాప్‌పై బ్యాన్ విధించాయి. యూజర్ల ప్రైవసీ, జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో నిషేధం విధించాయి. తాజాగా బెల్జియం సైతం పలు ఆంక్షలు విధించింది. బెల్జియంలోని ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ను వాడకుండగా నిషేధం విధిస్తూ బెల్జియం ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై తమ పని ఫోన్లలో చైనీస్ యాజమాన్యంలోని వీడియో యాప్ టిక్‌టాక్‌ను ఉపయోగించేందుకు అనుమతి లేదని బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డి క్రూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెల్జియం జాతీయ భద్రతా మండలి హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టిక్‌టాక్ కంపెనీ చైనా ఇంటిలిజెన్స్ సర్వీసెస్‌కు సహాయం చేస్తోందని పేర్కొన్నారు.