Namaste NRI

అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌  నిషేధానికి సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ నిషేధ బిల్లుకు 352 మంది అనుకూలంగా ఓటు వేయగా, 65 మంది వ్యతిరేకించారు. అధికార డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులతోపాటు విపక్ష రిపబ్లికన్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సెనేట్‌లో ఆమోదం తర్వాత ఈ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. బైడెన్‌ సంతకం తర్వాత ఈ బిల్లు చట్టం కానుంది.

విదేశీ నియంత్రిత యాప్‌ల నుంచి అమెరికన్లకు రక్షణ  పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్‌ గల్లాఘే కలిసి రూపొందించారు. ఈ బిల్లు టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించింది కాదని డెమోక్రాటిక్‌ సభ్యుడు కృష్ణమూర్తి తెలిపారు. దాన్ని నియంత్రిస్తున్న బైట్‌డ్యాన్స్‌ గురించి అని చెప్పారు.

Social Share Spread Message

Latest News