నరసింహ బోదాసు హీరోగా నటిస్తూ, స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం తిండి బోతు దెయ్యం. మోనిక సమత్తార్, తన్నీరు వాసవి కథనాయికలు. శిరీష బోదాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమా లతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రేలంగి నరసింహారావు క్లాప్ కొట్టగా, శిరీష కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో దర్శకుడు నరసింహ బోదాసు మాట్లాడుతూ వినోదం నిండిన హారర్ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. కథ చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మోనిక, వాసవి, అశోక్ గౌడ్, శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.