
రానున్న నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యూవత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే నేతల ప్రచారం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. నేడు జరగనున్న డిబేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమోక్రటిక్ నేత బైడెన్, రిపబ్లికన్ నేత ట్రంప్ నాలుగేళ్లలో తొలి సారి ముఖాముఖి తలపడనున్నారు. దీంతో వారు ఏయే అంశాలపై చర్చించనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. జూన్ 27న అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ చర్చను టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూడాలని ప్రతి పది మంది అమెరికన్లలో ఆరుగురు భావిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడిరచింది.
