ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి టాప్ గేర్ అనే టైటిల్ ఖరారు చేశారు. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తునాన్రు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకుని వైవిధ్యమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు అన్నారు దర్శక`నిర్మాతలు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అన్నారు ఆది సాయికుమార్. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ధనలక్ష్మి ప్రొడక్షన్‌పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికాంత్ దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.














