ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీధన లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం టాప్ గేర్. రియా సుమాన్ కథానాయిక. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్గా నటిస్తున్న చిత్రమిది. ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని పంచే కథ, కథనాలు ఇందులో ఉన్నాయి. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభించింది. విజయవంతమైన పలు చిత్రాలకి పనిచేసిన సాంకేతిక నిపుణుల భాగం కావడం ఈ సినిమాకి ప్రధాన బలం అన్నాయి సినీ వర్గాలు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి చిత్రవర్గాలు. ఈ చిత్రానికి సంగీతం:హర్షవర్ధన్ రామేశ్వర్, కూర్పు : ప్రవీణ్ పూడి, కళ: రామాంజనేయులు, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్.