బుట్టబొమ్మ పూజా హేగ్డే వరుస సినిమాలతో స్టార్ హీరోలతో జత కడుతూ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీకి మరోసారి అక్కినేని వారసుడితో జతకట్టే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య, పూజాహెగ్డే మరోసారి కలిసి నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నాగచైతన్యతో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఓ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆ చిత్రం కోసమే కథానాయిక పూజాహెగ్డేని సంప్రదించినట్టు సమాచారం. నాగచైతన్య, పూజాహెగ్డే ఇదివరకు కలిసి ఒక లైలా కోసం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. వెంకట్‌ప్రభు ఇటీవల తమిళంలో మానాడు తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తెలుగులోనూ రీమేక్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరి చైతు, పూజా మళ్లీ జంటగా కనబడతారా? వెయిట్ అండ్ సీ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)