అక్టోబర్ 1వ తేదీ నుంచి మూడో తేదీ వరకు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) వెల్లడిరచింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 11వ ట్రెడా ప్రాపర్టీ షో 100 మందికి పైగా డెవలపర్స్, బిల్డర్లు, ప్రమోటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయని ఆ వర్గాలు తెలిపారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే కొనుగోలు దారులకు విస్తృత శ్రేణి ఆఫర్లను నిర్మాణ సంస్థలు అందిస్తున్నాయని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా అధ్యక్షుడు ఆర్ చలపతిరావు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 800 చదరపు అడుగుల నుంచి 10 వేల చదరపు అడుగుల పై చిలుకు గల సొంతింటి కొనుగోలు దారులకు అందుబాటులో ఉంటాయన్నారు. వీటిÄ ధరల శ్రేణి రూ.30 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటాయన్నారు. ఈ ప్రాపర్టీ షోలో రుణాలు జారీ చేయడానికి వీలుగా 10కి పైగా ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయన్నారు.
ప్రఖ్యాతి గాంచిన ట్రెడా ప్రాపర్టీ షో మళ్లీ నగరానికి వచ్చిందని వైస్ ప్రెసిడెంట్ విజయసాయి తెలిపారు. డెవలపర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుందన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల ప్రాపర్టీలను ఒక వేదికపై అందిస్తామన్నారు. 10 సంవత్సరాలుగా విజయవంతంగా ఈ ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ 26 సంవత్సరాల క్రితం ఏర్పడిరదని తాము అందరికీ అందుబాటు ధరల్లో నివాస గృహాలను అందించామని ఆయన తెలిపారు.