క్రిష్ బండిపల్లి, మీరా కన్నన్, దీక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్వాట. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్‌ను తాజాగా హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్కే గాంధీ మాట్లాడుతూ ప్రేమ పట్ల నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పే చిత్రమిది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెల 22వ తేదీ నుంచి శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో షూటింగ్ చేయబోతున్నాం. త్రిభాసా చిత్రంగా మెప్పిస్తామని ఆశిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, మూసా అలీఖాన్, ధీరజ అప్పాజీ, రుద్రాక్షపురం నిర్మాత కొండ్రాసి ఉపేందర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రాని నిడిగంటి సాయిరాజేష్ మూవీస్ పతాకంపై ఎస్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంటగిరి శ్రీనివాస్ సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఆర్కే గాంధీ దర్శకుడు.