మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంపై దక్షిణాఫ్రికాలో టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాలకు ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో సంబురాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో సమూల మార్పులు రావాలని, వనరులను అన్ని వినియోగించుకోవాలన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తప్పక రాణిస్తారన్నారు. సమాజంలో సబ్బండ వర్ణాల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్నారన్నారు.
తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుందని, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించి ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలను విభజించే రాజకీయాలు తప్ప బీజేపీ ప్రజలకు ఉపయోగపడే రాజకీయూలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కమిటీ సభ్యులు హరీశ్ రంగా, సాయి కిరణ్ నల్ల, శ్రీనివాస్ రేపాల, వీ వంశీ, రాంబాబు తోడుపునురి, కిరణ్ కుమార్ బెల్లి, శ్రీధర్ రెడ్డి, సౌజన్ రావు, అరవింద్ చికోటి పాల్గొన్నారు.