Namaste NRI

వలసదారులకు ట్రంప్‌ ప్రభుత్వం వింత ప్రతిపాదన

తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలందరినీ ఒక ఐలాండ్‌లోకి తీసుకెళ్తారు. వాళ్లను టీమ్‌లుగా విభజించి పోటీలు పెడతారు. చివరగా గెలిచినవారిని జైలు నుంచి విడుదల చేస్తారు. ఈ కాన్సెప్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అమెరికా విదేశాంగ శాఖ ఇదే తరహాలో ఒక రియాలిటీ షో నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది. వలసదారులకు పోటీలు నిర్వహించి, గెలిచినవారికి అమెరికా పౌరసత్వం ఇచ్చేలా దీనికి రూపకల్పన చేశారు.

ఈ విషయాన్ని అమెరికాకు చెందిన హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ధృవీకరించింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఇంకా పూర్తిస్థాయి ఆమోదముద్ర పడలేదని అధికారులు చెప్తున్నారు. ఇది హంగర్‌ గేమ్స్‌ తరహాలో ఒకరినొకరు దాడి చేసుకునేలా, హింసాత్మకంగా ఉండదని చెప్పారు. అదే సమయంలో ఓడిపోయిన వారిని వారి దేశాలకు తిప్పి పంపే ప్రతిపాదన కూడా లేదన్నారు.

Social Share Spread Message

Latest News