ఇప్పటివరకు భారత్‌పై అదనపు సుంకాలతో మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొగొచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తానని ప్రకటించారు. దీనిపై తొందరలోనే ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తుండటంతో అమెరికాతో వాణిజ్య సంబంధాలు బీటలు వారాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య అడ్డకుంలను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు పలికేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నానని తెలిపారు.















