అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం కావాల్సిన డెలిగేట్స్ సంఖ్యను ట్రంప్ ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఇలియనాస్ గెలుపుతో ఆయన రూట్ మరింత క్లియరైంది. ఇలియనాస్‌లో 64 మంది రిపబ్లికన్ డెలిగేట్స్ ఉన్నారు. 2020 ఎన్నికల్లో ఇలియనాస్‌లో ట్రంప్‌పై బైడెన్ 17 పాయింట్ల తేడాతో గెలుపొందారు. 2016 ఇలియనాస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు.