
అమెరికాలో ఇప్పుడు అత్యధిక ప్రజల చెవులకు తెల్లటి బ్యాండేజ్‌లు కన్పిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ నేత, అధ్యక్ష బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు, ఆయన చెవికి గాయం కావడంతో అప్పటి నుంచి ఆయన చేవికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నాడు. దీనితో ఆయన మద్దతుదార్లు తొలుత ట్రంప్ సభలకు పెద్ద ఎత్తున చెవులకు ఇటువంటి వైట్ బ్యాండేజ్‌లతో కన్పించారు. కాగా ఇప్పుడు దేశంలోని పలు నగరాలలో కూడా వీధులలో సూపర్‌మార్కెట్లలో జనం ఎక్కువగా ఈ బ్యాండేజ్‌లతో కన్పించడం, తమ లీడర్‌కు ఇది సంఘీ భావం అని ప్రకటించడంతో దేశంలో ఇప్పుడు ఇదో బ్యాండేజ్ వేవ్ అయింది.
