ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర సంపద విలువ శుక్రవారం రూ.25.31 లక్షల కోట్లకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన కంపెనీ టెస్లా విలువ పెరగడంతో ఈ రికార్డు నమోదైంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ఈ వివరాలను వెల్లడించింది. టెస్లా మార్కెట్ విలువ శుక్రవారం 1 ట్రిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. రెండేళ్లలో ఇంత భారీ స్థాయికి చేరడం ఇదే ప్రథమం.
ఈ కంపెనీ షేర్ల విలువ 8.2 శాతం పెరిగి 321.22 డాలర్లకు చేరింది. ఈ కంపెనీ స్టాక్ ఈ వారం 29 శాతం లాభపడింది. 2023 జనవరి నుంచి అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా ఈ పెరుగుదల కనిపిస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత బాగా లాభపడినది బహుశా టెస్లా, ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు.