టిటిఎ ,ప్రసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ రోజు వరంగల్ లో జాబ్ మేళా ను విజయవంతం గా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని ప్రసంగించారు. టిటిఎ ప్రసిడెంట్ వంశీ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు జాబ్ మేళా ఎలా జరిగిందో వివరించారు..ఇలాంటి అనేక కంపెనీల తో మళ్లీ మళ్లీ వరంగల్ లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు.
మోహన్ రెడ్డి టిటిఎ నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన టిటిఎ సేవా డేస్ కార్యక్రమాలను వివరించారు. నవీన్ మలిపెద్ది టిటిఎ ప్రసిడెంట్ ఎలెక్ట్ మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగరాలకు సాప్ట్ వేర్ ను తీసుకు రావడం వంశీ రెడ్డి ప్రతిభ అని కొనియాడారు. సంతోష్ రెడ్డి గారు టిటిఎ డేస్ కో ఆర్డినేటర్ మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళా లాంటి కార్యక్రమాల మళ్ళీ మళ్ళీ చేపడతామని తెలిపారు. టి టి ఎ సెక్రటరీ కవిత రెడ్డి గారు మాట్లాడుతూ నూతనం గా ఎన్నికైన శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి,నాగరాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు..జాబ్ మేళా కు వచ్చిన ప్రతి ఒక్కరికీ జాబ్ రావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. జ్యోతి రెడ్డి టి టి ఎ నాయకురాలు హెల్త్ అండ్ వెల్ నేస్ అడ్వైసర్ గారు మాట్లాడుతూ ఒక్క ఫోన్ కాల్ తో కార్యక్రమం కు విచ్చేసిన ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపారు ..సేవా డేస్ కార్యక్రమాలను వివరించారు. మురళీ దర్ రెడ్డి క్వడ్రెంట్ సంస్థ MD మాట్లాడుతూ ఇప్పుడు జాబ్ లు రాని వాళ్లకు వచ్చే రోజుల్లో అవకాశాలు ఇస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే సంస్థ టిటిఎ అని అన్నారు. స్పోర్ట్స్ మెన్ గా స్టార్ట్ అయిన నా జీవితం SI గా అంచలంచెలుగా ఎస్పీ గా రిటైర్ అయ్యానని ఇప్పుడు మి ముందుకు ఎమ్మెల్యే గా వచ్చానని తెలిపారు. పే బ్యాక్ టు సొసైటీ అనే సూత్రం తో వచ్చిన టిటిఎ అద్భుతమైన సంస్థ అని తెలిపారు. వంశీ రెడ్డి తల్లి తండ్రీ తో పాటు ఆయన భార్య కృషిని ప్రశంసించారు. యువత వల్లే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదని తెలిపారు. జాబ్ మేళా కు వచ్చిన యువత కు అభినందనలు తెలిపారు. వంశీ రెడ్డి యువతకు రోల్ మోడల్ అని రియల్ హీరో వంశీ రెడ్డి అని అన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సంతోషం వేస్తుందని అన్నారు. వంశీ రెడ్డి తల్లి తండ్రికి నమస్కారం తెలిపారు. వరంగల్ జాబ్ హబ్ మార్చాలని దానికి టిటిఎ ను కోరారు.