Namaste NRI

మాస్ జాతర నుంచి తు మేరా లవ్ సాంగ్ రిలీజ్

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా తు మేరా లవర్ ను విడుదల చేశారు. రవితేజ -శ్రీలీల అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు.

సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో తు మేరా లవర్ గీతాన్ని స్వరపర్చగా, భాస్కరభట్ల రవికుమార్  సాహిత్యం సమకూర్చారు. ఈ పాటను రవితేజ  మూవీ ఇడియట్‌  లోని ఐకానిక్ చార్ట్‌బస్టర్ చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే  పాటకు ట్రిబ్యూట్ గా మలిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించారు. దాంతో పాటకో కొత్త విలువ చేకూరింది. దర్శకుడు భాను బోగవరపు,  రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా మాస్ జాతర ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న తన ప్రభావవంతమైన విజువల్స్ తో పాటకి తగ్గట్టుగా మాస్ వైబ్‌ను అద్భుతంగా చూపించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events