
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా గబ్బార్డ్‌కు ప్రధాని మోదీ గంగాజలం అందజేయగా, ప్రధానికి ఆమె రుద్రాక్షమాల బహూకరించారు. అంతకుముందు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో గబ్బార్డ్ భేటీ అయ్యారు. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూపై చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా ఆమెను కోరారు. రెండు నెలల సమయంలో వీరిద్దరూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించి నప్పుడు తులసితో సమావేశమయ్యారు.
