ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. తన స్థానంలో నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆరు వారాల్లో కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. అయితే ట్విట్టర్ బాస్‌గా ఎవరిని ఎంపికచేసినట్లు మాత్రం వెల్లడించలేదు. తాను ఇకపై కంపెనీ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొనసాగనున్నట్లు చెప్పారు. ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్, సిసోప్స్‌లను పర్యవేక్షిస్తానని మస్క్ పేర్కొన్నారు. కాగా, నూతన సీఈఓగా ఎన్‌బీసీయూనివర్సల్ మీడియాలో గ్లోబల్ అడ్వర్‌టైసింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగం చైర్మన్‌గా పనిచేస్తున్న లిండా యాకారినో ను మస్క్ ఎంపికచేసినట్లు తెలిసింది.


