Namaste NRI

టీసీఏ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

కెనడాలోని టొరంటోలో ఉగాది పండుగ, శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ)  ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో జరిగిన ఈ సంబురాలకు తెలంగాణ వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు. ఉగాది పండుగ నాడు పురోహితులు నరసింహాచార్యులు శ్రోతలకు పంచాంగ శ్రవణం చేయగా, శ్రీరామ నవమి నాడు శ్రీకాంత్ కాసర్ల శ్రీ సీతా రాముల కల్యాణ ఉత్సవాలు జరిపించారు.

ఈ సందర్భంగా టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల తెలంగాణ పండుగలు, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా 135 మంది కళాకారులు 23 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరించారు.ఈ వేడుకల్లో గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు.మునుపెన్నడు లేనివిధంగా 13 ఏండ్లలోపు చిన్నారులకు స్పెల్లింగ్ చాలెంజ్ పోటీలను నిర్వహించారు. బెస్ట్ బ్రెయిన్స్ అధినేత రమేష్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వేడుకల్లో గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు. 

ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, వరుణి గుజ్జుల యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లోకల్ బిజినెస్ లని కూడా టీసీఏ ప్రోత్సహిస్తు వస్తున్నది. ఇందులో భాగంగా విభిన్నమైన స్టాల్స్‌ను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు.

ఈ  కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి, భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయగా, శ్రీరామ నవమి కల్యాణ ఉత్సవాలకు హాజరైనవారికి వడపప్పు, పానకంతో కూడిన పండుగ భోజనాలు ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షులు శంతన్ నారెళ్లపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, కోటేశ్వర్ చెటిపెల్లి, ఆనంద్ తొంట, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చ, మాధురి చాతరాజు, రాము బుధారపు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీనివాస తిరునగరి, వేణుగోపాల్ రోకండ్ల, రాజేశ్వర్ ఈద, విజయ్ కుమార్ తిరుమలపురం, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, ప్రకాశ్‌ చిట్యాల పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events