
తెలుగు ప్రజలు విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నార్వేలో ఘనంగా జరుపుకొన్నారు. ఓస్లొలో నార్వే తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాగిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నార్వే తెలుగు సంఘం తొమ్మిదవ వార్షికోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిలుగా భారత రాయబారి ఆక్వినో విమల్ పాల్గొన్నారు. ఓస్లొ నగర మేయర్ వీడియో ద్వారా సంక్షిప్త సందేశం పంపించారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. నెదర్లాండ్స్ నుంచి విచ్చేసిన ప్రముఖ గాయకులు స్వాతి బెక్కెర, కార్తీక్ మద్దెల సంగీత విభావరి ఆకట్టుకుంది.


