యూకేను ఆర్థికమాంద్యం చుట్టుముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి జారుకుంది. ఇది భవిష్యత్తులో నూ కొనసాగవచ్చుననే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మాంద్యం ప్రభావం ప్రధానం గా ఉద్యోగాలపై పడుతుం దని, ఉద్యోగం రాకుండానే పోస్టు స్టడీ వర్క్ వీసా అయిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.25 లక్షల మేర అప్పు చేసి స్టిర్లింగ్ యూనివర్సిటీకి వచ్చానని, ఫుల్‌టైమ్ ఉద్యోగం దొరకకపోవడం తో రోజువారీ ఖర్చుల కోసం పార్ట్‌టై మ్ ఉద్యోగాలపై ఆధారపడాల్సి వ చ్చిందని వైష్ణవి అనే విద్యార్థిని వా పోయారు. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జీవన వ్యయం పె రుగుతున్నందున యూకేలో ఉద్యోగం చేయాలనే ప్రణాళికను విరమించుకొని భారత్‌కు తిరిగి వచ్చే యోచనలో విద్యార్థులు ఉ న్నా రు. విద్యార్థులు తమ పరిశోధనా పత్రాన్ని ఆగస్టు-సెప్టెంబర్‌లో పూర్తి చేసి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు పొందే వరకు పార్ట్ టైమ్‌గా పనిచేస్తారు. ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న జా బ్ మార్కెట్ పరిస్థితి మాంద్యంతో మరింత దిగజారిం ది. పెరుగుతున్న జీవన వ్యయం, పని ఒత్తిడి కారణంగా ఉద్యోగం పొంది న కొంత మంది విద్యార్థులు కూ డా స్పాన్సర్‌షిప్ ద్వారా వీసా పొ డిగించేందుకు ఆసక్తి చూపడం లేదు.