ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి యూకే సాయుధ దళాల మంత్రి జేమ్స్ హెప్పే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హెప్పే మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలు చేసినందుకు కేవలం రష్యా అత్యున్నత పాలకులనే కాకుండా, మిలటరీ కమాండర్లను కూడా బాధ్యులు చేస్తామని అన్నారు. రష్యా కమాండర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధ నేరాలను కేవలం పైన ఉన్న అధినేతలు మాత్రమే చేసినట్లు కాదు అని తెలిపారు. కమాండ్ లైన్‌లో చిట్టచివరి అధికారి వరకు అందరూ ఈ వార్ క్రైమ్స్‌కు పాల్పడినట్టేనని, వాటిని తాము రికార్డు చేస్తున్నామని, ఆయా వ్యక్తులను సదరు నేరాలకు బాధ్యులుగా లెక్కిస్తామని తేల్చి చెప్పారు.














