యూకేకు వచ్చే వారిని ఫ్యామిలీ వీసాపై స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు, నివాసితులపై ఆ దేశం పరిమితులు పెంచింది. భారతీయ వారసత్వంతో సహా కుటుంబ వీసాపై వారి బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే వారికి అవసరమైన కనీస ఆదాయ నిబంధనను ప్రస్తుతాని కన్నా 55 శాతానికి పైగా పెంచింది. యూకేకు రావా లనుకునే వారిని స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు నివాసితుల వార్షిక ఆదాయం 29,000 జీబీపీలు ఉండాలి. అయితే దానిని ఇప్పుడు 38,700 జీబీపీలకు పెంచింది. టాక్స్ చెల్లింపుదారులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని రిషీ ఈ నిబంధన విధించినట్టు యూకే హోం సెక్రటరీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.