Namaste NRI

ఉక్రెయిన్‌ సంక్షోభం.. బిమ్‌స్టెక్‌ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రస్తుతం ఐరోపాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఈ సందర్భంగా కూటమి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. మన ప్రాంతం ఆరోగ్య, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకుని నిలిచేందుకు ఐక్యత, సహకారం అవసరం అని మోదీ అన్నారు. అలాగే ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య కోసం అంగీకారానికి రావాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. బంగాళాఖాతం ప్రాతం అనుసంధానత, భద్రతకు వారధిగా మారే సమయం ఆసన్నమైంది అని ప్రధాని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events