Namaste NRI

ఉక్రెయిన్‌ మరో కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సైన్యంలో చేరదలిచిన విదేశీయుల కోసం వీసా తీసుకోవాలన్న నిబంధనను తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే రష్యా పౌరులకు ఈ అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉక్రెయిన్‌ సైన్యం తరపున పోరాడదలచిన వారు ముందుగా ఓ దరఖాస్తులో తమ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. గతంలో సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంటే పేర్కొనాలి. ఈ విషయంలో ఆసక్తి ఉన్న వారు తమ దేశాల్లో ఉక్రెయిన్‌ ఎంబసీలను సంప్రదించాలని విదేశాంగ శాఖ తెలిపింది. మనం కలిసికట్టుగా పోరాడి హిట్లర్‌ను ఓడిరచాం. పుతిన్‌ను ఇదే విధంగా ఓడిస్తాం అని అన్నారు. గతంలో అమెరికా,  ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు వెళ్లాలంటే టూరిస్ట్‌ వీసా తీసుకోవాల్సి వచ్చేది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events