Namaste NRI

అమెరికా ఆఫర్ ను తిరస్కరించిన ఉక్రెయిన్

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అగ్రరాజ్యం అమెరికా ఆఫర్‌ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు ఆయనకు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తిరిస్కరించనట్లు తెలిసింది.  ఉక్రెయిన్‌ ప్రభుత్వం తరపున విదేశాల్లోనూ రిప్రజెంట్‌ చేసేందుకు జెలెన్‌స్కీని సురక్షిత ప్రదేశానికి తరలిచేందుకు అమెరికా ఆసక్తిని ప్రదర్శించింది. కీన్‌ నుంచి సురక్షితంగా అధ్యక్షుడిని తరలిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా జెలెన్‌స్కీకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయన్ను తరలించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది.

                        రష్యా దాడి తర్వాత జెలెన్‌స్కీ బంకర్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం కీవ్‌ నగరంలోనే ఉన్నట్లు జెల్‌న్‌స్కీ తెలిపారు. తన స్టాఫ్‌తో కలిసి కొన్ని గంటల క్రితం ఓ వీడియోను ఆయన రిలీజ్‌ చేశారు. అందరం ఇక్కడే ఉన్నామని, ఇక్కడే పోరాడుతామని, తనకు ఆయుధాలు కావాలని జెల్‌న్‌స్కీ ప్రకటన చేశారు.  తమ సైనికులతో పాటు దేశాన్ని కాపాడుకుంటామని, కీవ్‌ నగరాన్ని విడిచి వెళ్లేది లేదని జెలెన్‌స్కీ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events