Namaste NRI

యూఎన్ వేదికగా పాకిస్థాన్ పై.. భారత్ ఫైర్

పాకిస్థాన్‌ తీరును భారత్‌ అంతర్జాతీయ వేదికపై ఎండగట్టింది. డీ కంపెనీ మూఠాకు ఆ దేశం ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్‌ టీఎస్‌ తిరుమూర్తి ఈ ఆరోపణలు చేశారు. ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం కాన్ఫరెన్స్‌  ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల మధ్య లింకులను గుర్తించి, సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. 1993 ముంబై పేలుళ్ల నిందితులు సిండికేట్‌ నేరాలకు పాల్పడ్డారని, వాళ్లకు పాకిస్థాన్‌ రక్షణ ఇవ్వడమే కాకుండా, ఫైవ్‌ స్టార్‌ ఆతిథ్యం ఇస్తోందని ఆరోపించారు. దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు 2020 ఆగస్టులో పాకిస్థాన్‌ అంగీకరించిన విషయం తెలిసిందే.

                         1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారికి పాకిస్థాన్‌ రక్షణ కల్పిస్తున్నట్లు ఇండియా పేర్కొన్నది. దావూద్‌ ఇబ్రహీంకు చెందిన వర్గానికి ఫైవ్‌ స్టార్‌ హాస్పిటాలిటీ కల్పిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడిరచింది.ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపును అడ్డుకోవాలని తిరుమూర్తి యూఎన్‌ను కోరారు. 2020 ఆగస్టులో 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులు, వాటి నాయకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దావూద్‌ ఇబ్రహీం భారతదేశానికి మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events