హైదరాబాద్‌లో వచ్చే ఏడాది అక్టోబర్‌లో మరో అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఈ సదస్సులో శాస్త్రవేత్తలు, జియో స్పేషియల్ రంగంలోని వివిధ రంగాలకు చెందిన ప్రపంచస్థాయి నిపుణులు భాగస్వాములు కానున్నారు. టువార్డ్స్ జియో` ఎనేబ్లింగ్ ద గ్లోబల్ విలేజ్ నినాదంతో నిర్వహించే ఈ సదస్సు జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నారు. ఈ సదస్సు ద్వారా స్టేక్ హోల్డర్స్‌ని, వివిధ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధ్యమవుతున్నది.