కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. సంజన, సోనాల్ ఠాకూర్ కథానాయికలు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడీ దివ్యదీప్తి నిర్మించారు. ప్రీరిలీజ్ వేడుకకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను మీకు బాగా కావాల్సినవాడిని షూటింగ్‌లో ఏ సమస్యసూ ఎవరి ముందూ పెట్టకుండా దివ్య దీప్తి గారు చేసుకుంటూ వెళ్లిపోయారని విన్నాను. దీనికి మూల కారణం కోడి రామకృష్ణగారు. వాళ్ల బ్యానర్‌లో సినిమా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాం. నేను కూడా అదే చేశాను అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె మాట్లాడుతూ లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారితో వర్క్ చేయడం హ్యాపీ. నా రెండో సినిమానే మణిశర్మగారితో చేయడం నా అదృష్టం అన్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఈ వేడుకలో కోడి దివ్య దీప్తి, కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనాల్ ఠాకూర్ పాల్గొన్నారు.