కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. అలాగే కిషన్ రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు.
విజయవాడ ఆశీర్వాద సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న కిషన్ రెడ్డి కారు ఎక్కుతుండగా డోరు తగిలి నుదిటి మీద స్వల్ప గాయమైంది. ఆయన మాత్రలు వేసుకుని పర్యటన కొనసాగించారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయన కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఆయనను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.